"క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తాం"

Telugu Lo Computer
0

 


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌‌‌‌లో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది. ఇప్పటికే ఒకరి పై మరొకరు విమర్శలు దిగుతూ హడావిడి చేస్తున్నారు. చాలా రోజులకు ముందే ప్రకాష్ రాజ్ ఒక అడుగు ముందుకు వేసి తన ప్యానల్‌‌ను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే మంచి విష్ణు రంగంలోకి దిగారు. తాను కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానంటూ విష్ణు ప్రకటించారు. ‘మా’ కు సొంత బిల్డింగ్ కట్టాలన్న నినాదంతో మొత్తం ఐదుగురు సభ్యులు ఈ సారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఈ పోటీలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నటి హేమ మాట్లాడుతూ ‘మా’ నిధులను దుర్వినియోగం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో మీడియాలో వైరల్ అయ్యింది. హేమ వ్యాఖ్యలపై ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ స్పందించారు. హేమ చేసిన ఆరోపణలను నరేష్ తప్పుబట్టారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ గౌరవ మర్యాదలను దెబ్బతీసేలా హేమ మాట్లాడారని నరేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.హేమపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని.. కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని నరేష్ అన్నారు. పరిస్థితులకు అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయని.. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడుతున్నాయని.. కరోనా దృష్ట్యా ‘మా’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)