వెలుగు చూసిన సమాధి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా మాగడి తాలూకాలోని దేవర మఠానికి చెందిన భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమికుంగి ఒక గుహ, ప్రాచీన కాలం నాటి ఇత్తడి, తామ్రం, మట్టి వస్తువులు లభించాయి. తట్టలు, దీపం స్తంభాలు, విభూధి ఉండలు, ఉయ్యాల స్తంభం, గంట తదితర వస్తువులు వెలుగు చూసాయి. గతంలో మఠానికి చెందిన స్వామీజీ ఒకరు సజీవ సమాధి అయ్యారని, ఆయన వస్తువులు కూడా సమాధిలో ఉండిపోయి ఇప్పుడు వెలుగు చూసాయని మఠం నిర్వాహకులు తెలిపారు. పోలీసులు పురాతత్వ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పురావస్తు శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)