రాకెట్‌ దాడులు తిప్పికొట్టాం

Telugu Lo Computer
0


ముందుగా హెచ్చరించినట్లుగానే కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ఐదు రాకెట్‌ దాడులు జరిగినట్లు అమెరికా ధ్రువీకరించింది. అయితే, క్షిపణి వ్యవస్థ ద్వారా వాటన్నింటినీ తిప్పికొట్టామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారి ఒకరు రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. అఫ్గనిస్తాన్‌ లోని హమీద్‌ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం జరిగిన రాకెట్‌ దాడిని తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. సీ- ర్యామ్‌ డిఫెన్స్‌ సిస్టం ద్వారా వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందన్నారు. కాగా సీ- ర్యామ్‌ అనేది ఒక ఆటోమేటిక్‌ సిస్టం. ప్రత్యర్థి దాడులను పసిగట్టి మెషిన్‌ గన్‌ ద్వారా వాటిని ఛేదిస్తుంది. ఇరాక్‌, అఫ్గనిస్తాన్‌లలో ఉన్న అమెరికా బలగాలను రక్షణగా అగ్రరాజ్యం ఈ సిస్టంను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)