నేషనల్ పెన్షన్ స్కీమ్‌ చందాదారులకు ఉపశమనం

Telugu Lo Computer
0



నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారులకు భారీ ఉపశమనం కలిగించే చర్యలను తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్‌పీఎస్‌లో చేరే గరిష్ట అర్హత వయసు పరిమితిని పెంచడంతో పాటు స్కీమ్ నుంచి బయటకు వెళ్లే వారి కోసం కూడా మార్పులు చేపట్టింది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ. దీంతో పాటు 65 సంవత్సరాల తర్వాత ఈ పథకంలో చేరిన వారి కోసం నిబంధనలను సవరించింది. వీరి నిధుల్లో 50 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించేందుకు అనుమతించింది. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌లో చేరడానికి గరిష్ట వయస్సు 65 సంవత్సరాలు ఉండగా, దీన్ని 70 ఏళ్లకు పెంచింది. ఈ మార్పుల తరువాత, ఈ స్కీమ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రవేశ వయసు 18-65 సంవత్సరాల నుంచి 18-70 సంవత్సరాలకు పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)