ఆటో ఎక్స్‌పో వాయిదా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 2 August 2021

ఆటో ఎక్స్‌పో వాయిదా?


ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ ప్రదర్శనగా పేరొందిన భారత ‘ఆటో ఎక్స్‌పో’ వాయిదా పడింది. కరోనా వ్యాప్తి, మూడో వేవ్‌ అంచనాల నేపథ్యంలోనే 2022 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరగాల్సిన ప్రదర్శనను వాయిదా వేస్తున్నట్లు ‘సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యానుఫాక్చరర్స్‌ (సియామ్‌)’ ప్రకటించింది. ఈ ప్రదర్శన నిర్వహిస్తే అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపింది. అప్పుడు భౌతిక దూరం పాటించడం సహా ఇతర కొవిడ్‌ నిబంధనల్ని అమలు చేయడం కష్టతరమవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో వైరస్ వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆటో ఎక్స్‌పోను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ ఏడాది చివరలో తదుపరి ఆటో ఎక్స్‌పో తేదీలను ప్రకటిస్తామని స్పష్టం  చేసింది. 2020 ఆటోఎక్స్‌పోకు ఆరు లక్షల మంది రావడం గమనార్హం.

No comments:

Post a Comment