ఏపీలో శుభకార్యాలపై ఆంక్షలు కఠినతరం

Telugu Lo Computer
0



తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ఇతర అంశాలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భముగా  కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వస్తున్నందున పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోట గుమ్మిగూడే అవకాశాలున్నాయని, దీని ద్వారా కోవిడ్‌ వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉన్నదని సమావేశంలో ప్రస్తావించారు. పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువ మంది ఉండేలా చూడాలని, పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. వీటితోపాటు ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ మంది గుమిగూడకుండా చూడాలన్నారు. అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని, వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)