పుష్కరాలు - విశిష్టత !

Telugu Lo Computer
0


పుష్కరాలకు సంబంధించి ఓ కధనం ప్రచారంలో వుంది. అదేమిటంటే, సృష్టి ఆరంభ సమయంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోర తపస్సు ఆచరించి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. ఈశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తుందిలుడు పరమానందభరితుడై తనకు ఈశ్వరుడిలో శాశ్వత స్థానం కల్పించమని అర్థించాడు. అందుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు. ఆ విధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. కావున పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పుణ్యజలం మరియు పోషించేవాడని కూడా అర్థం ఉంది. సృష్టి నిర్మాణక్రమంలో బ్రహ్మదేవునికి జలంతో అవసరం ఏర్పడగా, జలాధికారియైన పుష్కరుని తనకు ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుని చతుర్ముఖుడు కోరుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించడంతో పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలో ప్రవేశించాడు. ఒక సందర్భంలో సకల జీవరాశిని పునీతం చేసేందుకు ప్రాణులకు జీవనాధారమైన జలాన్ని ఇవ్వాల్సిందిగా బృహస్పతి బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలివెళ్ళనని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషరాశి మొదలు 12 రాశుల్లో ప్రవేశించినపుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పూర్తిగాను, మిగతా రోజుల్లో మధ్యాహ్న సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు. అందుకే  బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి. 

ఏ నదికి ఎప్పుడు పుష్కరం 

1. తామ్రపర్ణి - 2018అక్టోబర్  12నుంచి 23వరకూ 

2. పుష్కర్ - 2019 మార్చి 29నుంచి ఏప్రియల్ 9వరకూ 

3. తుంగభద్ర - 2020 మార్చి 30నుంచి ఏప్రియల్ 10వరకూ 

4. సింధు - 2021 ఏప్రియల్ 6నుంచి 17వరకూ 

5. ప్రాణహిత - 2022 ఏప్రియల్ 13నుంచి 24వరకూ 

6. గంగ - 2023 ఏప్రియల్ 22నుంచి మే3వరకూ 

7. నర్మద- 2024ఏప్రియల్ 22నుంచి మే3వరకూ 

8. సరస్వతి - 2025 మే15నుంచి 26వరకూ 

9. యమున - 2026 జూన్ 2నుంచి 13వరకూ 

10. గోదావరి - 2027 

11. కృష్ణ - 2028  

12 కావేరి  2029 

Post a Comment

0Comments

Post a Comment (0)