కోవెలమూడి సూర్యప్రకాశరావు

Telugu Lo Computer
0


కోవెలమూడి సూర్యప్రకాశరావు  తెలుగు సినిమా దర్శక నిర్మాతలలో ఒకరు.రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయనకుమారుడు కె. రాఘవేంద్రరావు కూడా దర్శక నిర్మాత అయ్యారు. సూర్యప్రకాశరావు 1914వ సంవత్సరం కృష్ణా జిల్లాకు చెందిన కోలవెన్నులో జన్మించారు.ప్రాథమిక విద్యాభ్యాసము ముగించుకొని ప్రకాశరావు కొన్నాళ్ళు భీమా ఏజెంటుగాను, ఒక బంగారు నగల దుకాణములోను ఉద్యోగం చేశారు.భారతీయ ప్రజా నాటక సంఘము యొక్క తెలుగు విభాగమైన ప్రజానాట్యమండలితో ప్రకాశరావు పనిచేసేవారు. ప్రకాశరావు సినీజీవితాన్ని నటునిగా 1941లో గూడవల్లి రామబ్రహ్మం తీసిన అపవాదు సినిమాతోనూ, 1940లో నిర్మించినా 1942లో విడుదలైన పత్ని సినిమాతోనూ ప్రారంభించారు.పత్ని సినిమాలో ఈయన కోవలన్ పాత్ర పోషించారు.ఈయన 1942లో ఆర్.ఎస్.ప్రకాశ్ తీసిన బభ్రువాహన సినిమాలో కూడా నటించారు. 1948లో ద్రోహి సినిమాతో సినీ నిర్మాణములో అడుగుపెట్టారు. ఇందులో నాయకుని పాత్రకూడా ప్రకాశరావే పోషించారు.నాయకిగా జి.వరలక్ష్మీ గారు నటించారు. స్వతంత్ర పిక్చర్స్ పతాకముపై విడుదలై విజవంతమైన ఈ సినిమాకు ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించారు.ఆ తరువాత 1949లో పతాకము పేరు ప్రకాశ్ ప్రొడక్షన్స్‌గా మార్చి మొదటిరాత్రి, దీక్ష వంటి సినిమాలకు నిర్మించి దర్శకత్వం తానే వహించారు.దాని తర్వాత ప్రకాశ్ ప్రొడక్షన్స్‌ను ఒక స్టూడియోగా అభివృద్ధి పరచి ప్రకాశ్ స్టూడియోస్‌గా నామకరణం చేశారు. 1950లో ఈయన తీసిన సినిమాలు చాలామటుకు మెలోడ్రామాలు. ఆ తరువాత కాలములో ప్రేమనగర్ వంటి సైకలాజికల్ ఫాంటసీలను తీశారు.ఈయన దర్శకత్వం వహించిన ప్రేమనగర్ సినిమా పెద్ద విజయం సాధించింది. ఈయన పుట్టన కణగళ్ తీసిన నగర హావు (1972) అనే కన్నడ ప్రేమకథా చిత్రాన్ని తెలుగులో కోడెనాగుగా పునర్నిర్మించారు.1970వ దశకంలో కన్నడ సినిమాలు కూడా తీశారు. ఈయన కొడుకు కె.రాఘవేంద్రరావు అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రాలను నిర్మించి తెలుగు చలన చిత్ర రంగములో బాగా పేరుతెచ్చుకున్నారు. ఇంకో కుమారుడు, కె.ఎస్.ప్రకాశ్ తెలుగు చిత్రరంగములో పేరొందిన ఛాయాగ్రాహకుడు.ఈయన అన్న కుమారుడు కె. బాపయ్య కూడా ప్రసిద్ధి పొందిన సినిమా దర్శకులు. ప్రముఖ సినీ నటి జి, వరలక్ష్మి  వీరి రెండవ భార్య. 1995 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చి సత్కరించింది. ప్రకాశరావు గారు 1996 సంవత్సరంలో మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)