పాక్‌ నుండి ఒలింపిక్స్‌కి పది మందే !

Telugu Lo Computer
0



టోక్యో ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ నుంచి పది  మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుండడంపై పాక్‌ మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్ నాజిర్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  22 కోట్ల జనాభా గల దేశం నుంచి ఒలింపిక్స్‌కు కేవలం 10 మంది ఆటగాళ్లే. ఇది నిజంగా విచారకరం. క్రీడల్లో పాకిస్థాన్‌ ఈ స్థాయికి దిగజారడానికి బాధ్యులైన ప్రతిఒక్కరికీ ఇది సిగ్గుచేటన్నారు. 2012 ఒలింపిక్స్‌కి, ఇప్పటికీ పరిస్థితులు ఎలా మారాయో అద్దం పట్టే ఓ చిత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తమ దేశంలో ప్రతిభకు కొదవలేదని నాజిర్‌ అభిప్రాయపడ్డారు. కానీ, క్రీడల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలిగే బాధ్యతగల నాయకులు లేరని వ్యాఖ్యానించారు. అలాగే చాలా మంది పాకిస్థాన్‌లో క్రీడలకు సంబంధించిన సంస్థలపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కానీ, ఎంతమంది ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారని ప్రశ్నించారు. ఆర్థిక సహకారం అవసరం ఉన్న ఒక ఆటగాడి వివరాలిస్తే ఎంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారని నిలదీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)