డాక్టర్‌పై అత్యాచారం

Telugu Lo Computer
0


ఒడిశా, అంగూల్ జిల్లాలోని చెండిపద ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ డాక్టర్ గా  పనిచేస్తోంది. ఆమెకు కేటాయించిన ప్రభుత్వ కార్వర్ట్స్‌లో తన సోదరుడితో పాటు కలిసి ఉంటోంది. అయితే మంగళవారం రాత్రి ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి అక్కడికి సమీపంలోని దాబాకు డిన్నర్‌కు వెళ్లాడు. దాబాలో భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లో ఉన్న సోదరి కోసం ఫుడ్‌ పార్శిల్‌ పంపాడు. దాబా యజమాని కుమారుడు  సుకంత బెహరా ఫుడ్ డెలివరీ చేసేందుకు మహిళా డాక్టర్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నఆమెపై బెహరా అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై మహిళా డాక్టర్, ఆమె సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెహరాపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)