మల్టీప్లెక్స్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌కు నో !

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించబోయే మల్టీప్లెక్స్ బిల్డింగుల్లో అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను ఏర్పాటు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం వెల్లడించింది. మొదటి 5 అంతస్తుల వరకు మాత్రమే పార్కింగ్‌ వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. పోడియం పార్కింగ్‌గా పేర్కొంటున్న దీనికే పర్మిషన్ ఇచ్చింది. ముంబై లాంటి మహానగరంలో ఇప్పటికే ఈ వ్యవస్థ అమల్లో ఉంది. అయిదు అంతస్తుల్లో కూడా సరిపోకపోతే రెండు బేస్‌మెంట్‌లకు అనుమతివ్వనున్నట్టు పేర్కొంది. ఈ రూల్స్ బ్రేక్ చేస్తే బిల్డింగ్ ఓనర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  2012లో రూపొందించిన బిల్డింగ్‌ రూల్స్‌ను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారు. శనివారం రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్‌వింద్ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)