ఇది కథ కాదు...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Thursday, 15 July 2021

ఇది కథ కాదు...!

 

తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఒక చిన్న గుడిసెలాంటి ఇంటిలో 80 సంవత్సరాల ఒక అవ్వ నివసిస్తుంది. తనని చూసుకోడానికి ఎవరూ లేరు. చుట్టు పక్కలవారు కూడా ఎవరూ ఆదరించేవారు కాదు. ఆ విషయం ఎలా తెలిసిందో గానీ ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలిసింది. నేరుగా ఆ అవ్వ ఇంటికి వచ్చి తనతో కలిసి భోంచేసి వెళుతూ ఆ అవ్వ చేతిలో ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు. ఒకరోజు ఆ కలెక్టర్ గారు ఇంట్లో తన భార్య చేత వంటచేయించుకుని, క్యారియర్ తీసుకుని నేరుగా ఆ అవ్వ ఇంటికి వెళ్లి లోపలికి రావచ్చా అవ్వ అని అడిగాడు. ఆ అవ్వకు తను ఎవరో తెలియదు. ఏం చేయాలో అర్థం కాలేదు. కూర్చోడానికి కుర్చీ లేదని చెప్పింది.  ఫరవాలేదు కింద కూర్చుంటానని చెప్పి తనను పరిచయం చేసుకున్నాడు. చుట్టు పక్కల వారు బయటికి వచ్చి గమనిస్తున్నారు.

అవ్వా ఈ రోజు నీతో కలిసి భోజనం చేస్తాను అన్నాడు. మా ఇంట్లో తినడానికి కంచాలు లేవు. అరటి ఆకులోనే తినాలి అని చెప్పింది.. సరే అని కింద కూర్చోని అవ్వతో కలిసి భోజనం చేశాడు. వెళుతూ అవ్వ చేతిలో ఒక కవర్ ఇచ్చాడు.. అవ్వకు అర్థం కాలేదు. అందులో ఇందిరా ఆవాస్ యోజన కింద మంజూరు చేసిన ఇంటి పత్రాలు మరియు వృద్దాప్య ఫించనుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. వెళుతూ ఆ కలెక్టర్ గారు అవ్వతో చెప్పాడు. నువ్వు డబ్బులు తీసుకోవడానికి బ్యాంక్ కు వెళ్ళనవసరం లేదు.  డబ్బులు నీ ఇంటికే వచ్చే ఏర్పాటు చేశానని అన్నాడు. ఆ అవ్వ కళ్ళ నిండా ఆనందభాష్పాలతో ఆ అధికారికి చేతులెత్తి నమస్కరించింది. ఇది కదా నిజమైన అర్హులకు సహాయం చేయడం అంటే అలాంటి అధికారులు ప్రతి జిల్లాకు ఉంటే నిజమైన పేదలు బాగుపడే రోజులు చూడాలి. 

No comments:

Post a Comment

Post Top Ad