మొక్కజొన్న పొత్తుల్ని తొక్క తీసి తింటున్న ఏనుగు !

Telugu Lo Computer
0


ఏనుగుకి చెరుకు గడలంటే ఎంతిష్టమో.. ఓ ఏనుగు ముందు మోపులు మోపులు చెరుగు గడలు పెడితే క్షణాల్లో లాగించేస్తుంది. అంత ఇష్టం ఏనుగుకు అవంటే. అలాగే వెలగ పండ్లను కూడా భలే గుటుక్కు గుటుక్కుమనిపిస్తుంది. మొక్కజొన్నపొత్తులంటే కూడా చాలా ఇష్టం ఏనుగులకు. గడ్డి, ఆకులు, చెట్ల కొమ్మలతో పాటు రకాల మొక్కల్ని..గెలల కొద్దీ అరటిపండ్లు లాగించేస్తాయి ఏనుగులు. అంతేనా..ఇంకా చాలానే తింటుంది. ఎందుకంటే ఏనుగంటే భారీ ఆకారం..దానికి తగినట్లుగా తినాలి కదా మరి. కానీ ఏనుగు ఏది తిన్నా డైరెక్టుగానే తినేస్తుంది. అరటి పండ్లు తింటే తొక్క ఒలిచి తినదు కదా మనలాగా.. కానీ ఓ ఏనుగు మాత్రం అరటి పండ్లను కాదు గానీ..మొక్కజొన్న పొత్తుల్ని తినే విధానం మాత్రం భలే చూడముచ్చటగా ఉంది. సాధారణంగా ఏనుగు చెరుకు గడలు తిన్నా..అరటి పండ్లు తిన్నా గానీ డైరెక్టుగానే తినేస్తుంది. తొక్కలతో సహా..కానీ  ఓ ఏనుగు మాత్రం మొక్కజొన్న కండెల్ని తొక్క తీసి తొక్కతో పాటు ముచ్చిక కూడా తీసి మరీ తింటోంది.  అలా ఈ ఏనుగు మొక్కజొన్న కండెల్ని తినే తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)