ఆకాశ్​ మిసైల్ ప్రయోగం విజయవంతం

Telugu Lo Computer
0


దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందీపూర్ తీరప్రాతంలోని ఇంటిగ్రేడెట్​ టెస్ట్​ రేంజ్​ నుంచి శుక్రవారం ఉదయం 11:45గంటలకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఈ మిసైల్ ని ప్రయోగించింది. ప్రతికూల వాతావరణంలోనూ క్షిపణి.. లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు డీఆర్​డీఓ ప్రకటించింది. గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ గురి తప్పకుండా ఛేదించిందని డీఆర్​డీఓ తెలిపింది. కాగా, రెండు రోజుల వ్యవధిలో ఆకాశ్‌కు ఇది రెండో పరీక్ష.

ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్‌ సొంతం. ఇవాళ్టి టెస్ట్ లో.. లాంచర్, రాడర్‌, కమాండ్ అండ్‌ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్​డీఓ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)