హైదరాబాద్‌లో వంద టీకా కేంద్రాలు

Telugu Lo Computer
0


18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్‌ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింన నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకా వేస్తామన్నారు. కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని కేంద్రానికి వెళితే వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రజలు తమ దగ్గర్లో ఉన్న కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)