శ్రీశైలం గేట్లు ఎత్తివేత

Telugu Lo Computer
0


శ్రీశైలంలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో  ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. అంతకుముందు అధికారులు సైరన్‌ మోగించారు. పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు వరద పరుగులు పెడుతోంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 881.5 అడుగులకు నీరు చేరింది. ఎగువన ప్రవాహం నిలకడగా వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు తెరచి దిగువకు నీరు వదిలారు. రెండు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. 

Post a Comment

0Comments

Post a Comment (0)