కోటితో ఉడాయించిన పూజారి..!

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని నిజమాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలో ధర్మారం(బి) గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గత కొన్నాళ్లుగా పూజారిగా పనిచేస్తున్న శ్రీనివాస శర్మ వేద మంత్రాల పేరు చెప్పి గ్రామ ప్రజలను దగా చేశాడు.  కరోనా కష్టకాలంలో తన పథకానికి తెరలేపాడు. తమ కష్టాలను దేవుడికి చెప్పుకునేందుకు వచ్చిన మహిళా భక్తులను తన మాయమాటలతో మోసం చేశాడు. ప్రత్యేక పూజలు అంటూ నమ్మించాడు. ఆ పూజలు చేయడం ద్వార ఆర్ధికంగా బలపడతారని మాయమాటలు చెప్పాడు. ఆయన మాటలను నమ్మిన గ్రామ ప్రజలు పూజలు చేశారు.  తనకు బడా వ్యాపారులు తెలుసని, వారు ఈ పూజలు చేయించుకునేందుకు సిద్దంగా ఉన్నారని అయితే... వారు స్వయంగా ఇక్కడకు రాలేరు గనుక ముందుగా కొంత పెట్టుబడి పెట్టి పూజలు చేయాలని చెప్పారు. అనంతరం పెట్టుబడులు పెట్టిన వారికి కమీషన్ రూపంలో డబ్బులు ఇస్తానని చెప్పారు. దీంతో గ్రామంలోని సుమారు నలబై మంది మహిళ వద్ద కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఇందుకోసం వారికి చెక్కులను కూడా ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు కూడా ఒకరు ఇచ్చిన వాటిని మరోకరికి ఇచ్చి మోసం చేశాడు. ఇలా కమీషన్ రూపంలో ముందుగా కొంతమంది మహిళలకు డబ్బులు కూడా చెల్లించాడు. చాలా మంది మహిళలు తమ ఇంట్లో ఒకరికి తెలియకుండా మరోకరు పూజారికి డబ్బులు చెల్లించారు. ఇక గ్రామానికి చెందిన ఓ మహిళ తన భూమి అమ్మగా వచ్చిన మొత్తం 25 లక్షల రూపాయలను పూజారీ చేతిలో పెట్టి కన్నీరు మున్నిరవుతుంది. మరోవైపు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న సోమ్మును పూజారి రూపంలో మాయం చేశాడు. భక్తులతో పూజలు చేయించి, తిరిగి ఆ డబ్బులను హూండీలో వేయించి మరి దోపిడి చేశాడు. భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)