ఖరీదైన శాండ్ విచ్

Telugu Lo Computer
0


న్యూయార్క్ లోని స్రెండిప్టీ3 పేరుతో ఓ రెస్టారెంట్ శాండ్ విచ్ లను తయారు చేయటంలో చాలా ఫేమస్. ఇక్కడ తయారయ్యే రుచికరమైన శాండ్ విచ్ లను తినేందుకు దూరప్రాంతాల నుండి ఆహార ప్రియులు వస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ దొరకని వెరైటీ శాండ్ విచ్ లు ఇక్కడ లభిస్తాయి. అయితే తాజాగా ఈ రెస్టారెంట్ నిర్వాహకలు రూపొందించిన శాండ్ విచ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలో ఖరీదైన వెన్న క్వీన్ టెస్సెన్షియల్ గ్రిల్ల్డ్ చీజ్ ను ఈ శాండ్ విచ్ తయారీలో వాడతారు. దీనికి పైపూతగా గోల్డ్ ఫాయిల్ తో అలంకరిస్తారు. అందుకే ఈ శాండ్ విచ్ ఖరీదు 16వేల రూపాయలు. సాధారణంగా రెస్టారెంట్లలో దొరికే శాండ్ విచ్ ల ఖరీదు 100 నుండి 200 రూపాయలు ఉంటాయి. గత ఏడేళ్ళ కాలంలో ఇంత ఖరీదైన శాండ్ విచ్ ను ఎవరూ తయారు చేయలేదు. దీంతో గిన్నీస్ బుక్ నిర్వాహకులు వరల్డ్ రికార్డుకు ఎంపిక చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)