పీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల బీమా !

Telugu Lo Computer
0


ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ EDLI ఇన్సూరెన్స్ స్కీమ్ కింద పీఎఫ్ చందాదారులకు రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. గతంలో ఈ ఇన్సూరెన్స్ కవర్ గరిష్టంగా రూ.6 లక్షలుగా ఉండేది. కానీ ఇప్పుడు రూ.7 లక్షల వరకు లభిస్తాయి. కేంద్రం ఇటీవలనే ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచింది. పీఎఫ్ సబ్‌స్క్రైబర్లు ప్రమాదం, అనారోగ్యం కారణంగా మరణిస్తే.. అప్పుడు వారి కుటుంబాలకు ఈ పీఎఫ్ ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి. పీఎఫ్ అకౌంట్ నామినీకి డబ్బులు వస్తాయి. నామినీ ఎవ్వరూ లేకపోతే భాగస్వామి లేదా పిల్లలకు ఈ డబ్బులు లభిస్తాయి. కరోనా వల్ల చనిపోయినా కూడా ఈ డబ్బులు వస్తాయి. బేసిక్ శాలరీ, డీఏకు 35 రెట్లు ఈ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అలాగే బోనస్ కింద గరిష్టంగా రూ1.75 లక్షల వరకు పొందొచ్చు. ఉదాహరణకు బేసిక్, డీఏ రూ.15 వేలు అనుకుంటే.. అప్పుడు ఇన్సూరెన్స్ కింద రూ.5.25 లక్షలు, బోనస్ రూ.1.75 లక్షలు మొత్తంగా రూ.7 లక్షల వరకు లభిస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)