కేంద్రం పన్నే అత్యధికం...!

Telugu Lo Computer
0

 


6 నెలల్లో 63 సార్లు పెట్రోల్
61 సార్లు డీజిల్ ధర పెరుగుదల
ఇంధన ధరలు పెరుగుదల దేశంలో కొనసాగుతోంది. ఇందులో కేంద్రమే అత్యధికంగా పన్ను విధిస్తోంది. గడిచిన ఆరు నెలల్లో 63 సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి ఇటీవల పార్లమెంటులో ఎంపిలు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
2021 జనవరి 1 నుంచి జులై 9 మధ్య పెట్రోల్‌ ధరలు 63 సార్లు, డీజిల్‌ 61 సార్లు, వంట గ్యాస్‌ 5 సార్లు పెరిగాయి. పెట్రోల్‌ లీటర్‌ బేస్‌ ధర రూ.44.94 ఉండగా, దానిపై కేంద్రం రూ.32.90 ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. రాష్ట్రాలు రూ.23.35 వ్యాట్‌ను విధిస్తున్నాయి. అలాగే డీజిల్‌ లీటరు రూ.44.80 కాగా, దానిపై రూ.31.80 కేంద్రం ఎక్సైజ్‌ సుంకం విధిస్తోంది. దీనికి రాష్ట్రాలు రూ.13.12 వ్యాట్‌ను విధిస్తున్నాయి.
డీజిల్‌పై రూ.2,33,296 కోట్లు ఎక్సెజ్‌ సుంకం వసూలు
డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్‌ డ్యూటీ వల్ల 2020-21లో రూ.2,33,296 కోట్లు వసూలు జరిగింది. పెట్రోల్‌పై రూ.1,01,598 కోట్లు ఎక్సైజ్‌ సుంకం వసూలు చేశారు. వంటగ్యాస్‌పై రూ.1,195 కోట్లు, విమాన ఇంధనం (ఎయిర్‌ టర్బో ఫ్యూయల్‌ (ఎటిఎఫ్‌)పై రూ.779 కోట్లు, ముడి చమురుపై సెస్‌ రూ.7,877 కోట్ల ఎక్సైజ్‌ సుంకం వసూలు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)