బాయ్‌ ఫ్రెండ్‌ కావాలి !

Telugu Lo Computer
0


న్యూయార్క్‌లోని హడ్సన్ వ్యాలీకి చెందిన యువతి  తన స్నేహితురాలి వివాహానికి హాజరుకావదానికి, త్రాను లేని సమయంలో  అత్తగారు బోర్‌గా ఫీల్‌ కాకూడదనే ఉద్దేశ్యంతో తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలని ప్రకటన ఇచ్చింది.   అందుకు సదరు వ్యక్తికి అర్హతలుగా 40 నుంచి 60 ఏళ్ల , వీటితో పాటు డ్యాన్స్, మంచి  మాటకారిగా ఉండాలని పేర్కొంది. కేవలం రెండు రోజులకు మాత్రమే ఆ వ్యక్తి తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్‌గా వ్యవహరిస్తే సరిపోతుందని ఆ  ప్రకటనలో తెలిపింది.  దానికి సుమారు 960 డాలర్లు (సుమారు రూ. 72000) చెల్లించనున్నట్లు తెలిపింది.  సుమారు వెయ్యి డాలర్లు అంటే మంచి ఆఫరే కాబట్టి దీనికి చాలా మంది అప్లై కూడా చేసుకుంటున్నారట. వీరి నుంచి వాళ్ల అత్తకు ఓ బాయ్‌ ఫ్రెండ్‌ను ఎలా సెలక్ట్ చేస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)