గంటలోనే పీఎఫ్ అడ్వాన్స్ !

Telugu Lo Computer
0


కరోనా చికిత్స లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ(అత్యవసర వైద్య అవసరాలు) పరిస్థితుల్లో పీఎఫ్ కస్టమర్లు తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) అకౌంట్ నుంచి లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చని ఈపీఎఫ్ తెలియజేసింది.  అంతేకాకుండా  ఈ సదుపాయాన్ని పొందేందుకు ఎలాంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం కూడా లేదంది.

జూన్ 1 ఈపీఎఫ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం కరోనా సహా ఎలాంటి ప్రమాదకరమైన వ్యాధి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లయితే లక్ష రూపాయల వరకు మెడికల్ అడ్వాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. దరఖాస్తు చేసుకున్న గంటలోనే ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేస్తామంది.

1. రోగిని చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సిజిహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. అతన్ని అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లయితే అప్పుడు ఓ అధికారి పూర్తిగా పరిశీలించి రిపోర్ట్ అందించిన తర్వాత మెడికల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.

2. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా రోగి, అతన్ని చేర్పించిన ఆసుపత్రి వివరాలను తెలియజేస్తూ ఓ అప్లికేషన్‌ను సమర్పించాలి. అంచనా వ్యయం లేదని పేర్కొనాలి. దాంతో మెడికల్ అడ్వాన్స్ మంజూరు అవుతుంది.

3. మెడికల్ అడ్వాన్స్‌కు దరఖాస్తు చేసుకున్న గంటలోపే ఆ డబ్బు ఖాతాదారుడి అకౌంట్‌లోకి బదిలీ అవుతుంది.

4. ఈ మెడికల్ ఎమర్జెన్సీ అడ్వాన్స్ కొవిడ్ 19 అడ్వాన్స్ కు పూర్తి భిన్నమైంది. ఇందులో మొత్తం ఫండ్ లో నాన్ రిఫండబుల్ గా 75శాతం పొందే అవకాశాన్ని కల్పించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)