సామెతలు ....!

Telugu Lo Computer
0

 


* ఉండ ఇల్లు లేదు – పండ మంచం లేదు !

* ఆకారపుష్టి నైవేద్యనష్టి !

* ఆకు వెళ్ళి ముల్లు మీద పడ్డా, ముల్లు వెళ్ళి ఆకు మీద పడ్డా ఆకుకే నష్టం !

* ఆకులేని పంట అరవైఆరు పుట్లు…!

* ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య !

* ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు !

* ఇరుపోటీలతోటి ఇల్లు చెడె, పాత నొప్పులతోటి ఒళ్ళు చెడె !

* ఈగ వ్రణం కోరు – నక్క పీనుగ కోరు !

* ఈ చేత చేస్తారు – ఆ చేత అనుభవిస్తారు !

* ఈటె పోటు మానుతుంది గానీ మాట పోటు మానదు !

* ఈడు చూసి పిల్లని యివ్వాలి – పిడి చూసి కొడవలి కొనాలి !

* ఈడ్పు కాళ్ళు, ఈడ్పు చేతుల ఇతడేనమ్మా యిల్లరికపుటల్లుడు !

* ఉంటే ఊరు – పోతే పాడు !

* ఉంగరాల చేతితో మొట్టేవాడు చెబితే వింటారు !

* ఉంటే అమీరు – లేకుంటే పకీరు

Post a Comment

0Comments

Post a Comment (0)