అంచనాలకు చేరుకోలేని మారుతీ లాభాలు

Telugu Lo Computer
0


దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. నికర లాభం రూ.440.8 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సీజన్లో  కంపెనీ రూ.249.4 కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అయితే, ఈసారి లాభాలు విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి. రెండో దశ కరోనా విజృంభణతో కంపెనీ విక్రయాలు పడిపోవడమే ఇందుకు కారణం. క్రితం త్రైమాసికంతో పోలిస్తే మాత్రం కంపెనీ లాభాలు 62.19 శాతం తగ్గాయి. కంపెనీ సమీకృత ఆదాయం 332.72 శాతం పెరిగి రూ.17,770.7 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.4,105 కోట్లు ఆదాయాన్ని ఆర్జించింది. కంపెనీ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 3,53,614 వాహనాలను విక్రయించింది. వీటిలో 3,08,095 దేశీయంగా అమ్ముడుకాగా.. 45,519 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)