సామెతలు ....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 28 July 2021

సామెతలు ....!


* అంచు డాబే కాని, పంచె డాబు లేదు !

* గట్టు నుండి ఎన్నయినా చెప్తారు. !

* ఒల్లని భార్య చేయి తగిలినను ముప్పే, కాలు తగిలినను తప్పే !

* ఓపనివారు కోరని వస్తువులు, ఓర్చనివారు అనని మాటలు ఉండవు !

* ఓర్చినమ్మకు తేట నీరు !

* అంగడి వీధిలో అబ్బా! అంటే, ఎవడికి పుట్టేవురా కొడుకా? అన్నట్లు !

* అంగడి నుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే !

*  అంత పెద్ద పుస్తకం చంకలోవుంటే, పంచాంగం చెప్పలేవా అన్నట్లు !

* అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు కట్టింది ముంతాత కొప్పు !

* అందం కోసం పెట్టిన సొమ్ము ఆపదలో అక్కరకు వచ్చిందన్నట్లు !

* అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి పోక తప్పదు !

* అంధుడికి అద్దం చూపించినట్లు !

* కంగారులో హడావుడి అన్నట్లు !

* కంచం, చెంబూ బయట పారేసి రాయి రప్ప లోపల వేసు కున్నట్లు !

* కంచాలమ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని !

1 comment: