ఏపీ సర్కార్ టాప్ !

Telugu Lo Computer
0

సంక్షేమ పథకాల అమలు, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రికార్డుస్థాయిలో చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. లక్షలాది మంది పేదలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తున్న క్రెడిట్ ఏపీకి దక్కింది. ప్రభుత్వమై లబ్ధిదారుల తరపున బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఉచిత వైద్యం అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు నీతి అయోగ్ ప్రకటించింది. 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఏయే రాష్ట్రాల్లో బీమా కింద ఉచిత వైద్యం అందిస్తున్నారనే అంశంపై నీతి అయోగ్ గణాంకాలు విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 74.60 శాతంతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తున్నవారికంటే ఎక్కువ మందే ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చారు. అలాగే ఏపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 2,436 రకాల చికిత్సలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా ట్రీట్ మెంట్ అందేలా ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ ను ప్రభుత్వమే కంపెనీలకు చెల్లిస్తోంది.  ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మహమ్మారికి ట్రీట్ మెంట్ అందించేలా చర్యలు తీసుకుంది. అరుదైన వ్యాధులకు అత్యాధునిక చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అందించేలా జీవోలు కూడా ఇటీవల జారీ చేసింది. తెల్లరేషన్ కార్డుతో సంబంధం లేకుండా రూ.5లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారందరికీ వర్తింపజేయడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)