గ్యాస్ బండ బాదుడు !

Telugu Lo Computer
0



సబ్సిడీయేతర వంట గ్యాస్‌ ధరలను 14.2 కిలోగ్రాముల సిలిండర్‌పై రూ.25.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆరు నెలల్లో 14.2 కిలోగ్రాముల సిలిండర్ ధర రూ.140 పెరిగింది. దీంతో ఢిల్లీ, ముంబైలో మే 1 నుంచి 809 రూపాయలుగా ఉన్న 14.2 కిలోల సిలిండర్ ధర రూ.834.50కి చేరింది. చెన్నైలో అత్యధికంగా రూ.850.50గా 14.2 కిలోగ్రాముల సిలిండర్ ధర ఉంది. మే 1 నుంచి నిన్నటి వరకు అక్కడ సిలిండర్ ధర 825 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో మే 1 నుంచి రూ.835గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 835.50 రూపాయలకు మాత్రమే చేరింది. కాగా, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.76 పెరిగింది. పెట్రోల్ ధర పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతోన్న సామాన్యుడి నెత్తిన గ్యాస్ ధరల రూపంలో మరో పిడుగు పడింది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)