ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు

Telugu Lo Computer
0



ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు  కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఢిల్లీలో గరిష్ఠంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత, గుర్గావ్‌లో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయనీ  భారత వాతావరణ శాఖ  తెలిపింది. రెండు నగరాల్లో ఉష్ణోగ్రత సాధారణం  కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. ఒక్కసారిగా పెరిగిన ఎండలతో దేశ రాజధానిలో విద్యుత్‌ వినియోగం కూడా బాగా పెరిగింది.  వేడిని తట్టుకోలేక ఎయిర్‌ కండిషన్ల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు.  గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ బుధవారం 6,921 మెగావాట్లకు పెరిగిందని, ఈ వేసవిలో ఇప్పటి వరకు ఇదే అత్యధికమని అధికారులు తెలిపారు. జూలై 7వ తేదీ వరకు రాష్ట్రంలో రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, అప్పటి వరకు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో  వేడి గాలులు  కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)