300 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేత

Telugu Lo Computer
0


కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా ముంబైలో 300 వ్యాక్సినేషన్ కేంద్రాల్లో టీకాలు వేసే కార్యక్రమాన్ని ఈరోజు నిలిపివేసినట్లు  గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలియజేసింది. ఇంతకుముందు కూడా వ్యాక్సిన్ల కొరతతో టీకాలు వేయడాన్ని ఏప్రిల్, మే నెలలో పలుమార్లు నిలిపివేశారు. అయితే నగరంలోని 98 ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో టీకాలు వేస్తున్నారు. జులై నెల తొలి రోజునే పలు వ్యాక్సినేషన్ సెంటర్లు మూతబడ్డాయి. కాగా ముంబైలో జూన్ నెలలో 20 లక్షలకుపైగా జనాభాకు టీకాలు వేశారు. ముంబైలో జూన్ 30 వరకూ మొత్తం 54 లక్షల, 35 వేల, 731 మందికి టీకాలు వేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)