ఏపీలో కర్ఫ్యూ సడలింపు

Telugu Lo Computer
0


రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించి  కర్ఫ్యూ వేళలలో  సడలింపు నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 21 నుండి 30 వరకు కర్ఫ్యూ నిబంధనల్లో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సాయంత్రం 5 గంటలకే దుకాణాలను బంద్ చేయ్యాలి.  తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మాధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు ఇచ్చింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 మాత్రమే సడలింపు ఉంది. ఈనెల 21 నుంచి నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని తెలిపింది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేసింది ప్రభుత్వం. కర్ఫ్యూ సడలింపులు పెంచినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించడం, దుకాణాలు, మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే లాక్‌డౌన్‌, కర్ఫ్యూ సడలింపులు ఇస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)