* అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి..
* ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి...
* నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం అవునేతి దీపం పెట్టాలి,
* శత్రు పీడల, గండాలు ఆస్తి వివాదాలు ఇంట్లో వారి అనారోగ్యం తొలుగుటకు తెలుపు నువ్వుల నూనె తో నిత్యా దీపారాధన చేయాలి.
* దేవుడి గుడికి వెళ్ళినప్పుడు గుడి వెనుకభాగం (బలిపీఠం దగ్గర తాకడం కానీ తల అనించడం కానీ చేయకూడదు.
* బలిపీటాల దగ్గర అర్చకులు తప్ప ఎవరూ ఏది అక్కడ పెట్ట కూడదు..
గుడిలో దేవుడికి, అర్చకులకు తప్ప ఎవరికీ నమస్కారాలు చేయకూడదు.
* నవగ్రహాలు తాకి మొక్క కూడదు...
* షష్ఠి, అష్టమి, త్రయోదశి నాడు తలకు నూనె అంటుకోకూడదు,
* రాత్రి పూట తల చిక్కు తీయకూడదు,
* పెరుగు చేతితో చిలక కూడదు,
* నీరు, పాలు, పెరుగు, నెయ్యి కి అంటు ఉండదు.
అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకోవచ్చు..
* లక్ష్మీ దేవి అనుగ్రహానికి పూజలు ఉన్నాయి,
* లక్ష్మీ దేవి నివాసం పాలు, లక్ష్మీ స్థానాలు అనేకం ఉన్నాయి..
* అలాగే జేష్ఠ దేవి అనుగ్రహం ఎలా పొందాలి
* జేష్ఠ దేవి నివాసం పులిహోర ,జేష్ఠ దేవి స్థానాలు కూడా అనేకం ఉంటాయి..
* పులిహోర చేసి దేవుడికి నివేదన చేస్తే జేష్ఠా దేవి పెట్టె కష్టాలనుండి ఉపశమనం లభిస్తుంది,
* పులిహోర చేసి పంచి పెడితే జేష్ఠా దేవి శాంతిస్తుంది. అందుకే పెద్దవాళ్ళు వారానికి ఒక్కసారి అయినా ఇంట్లో పులిహోర వండుకునే వాళ్ళు...పంచి పెడితే ఇంకా మంచిది.
* రాత్రి పూట ఆహారం తీసుకోకుండా నిద్రపోకూడదు, ఆహారం రుచిగా లేకపోయినా బాగలేదు అంటూ తినకూడదు. తిట్టుకుంటూ..వంట చేయకూడదు. తినే వారు కూడా తిట్టుకుంటూ తింటారు.. సంతోషం గా వంట చేస్తే సంతోషం గా తింటారు...
* ఎప్పుడూ నిద్రపోతూ ఉండే వాడు,
అసలు నిద్రపోకుండా ఉండే వాళ్ళు,
ఎప్పుడూ తింటూనే ఉండే వారు,
అసలు ఆహారం పైన శ్రద్ద లేకుండా పస్థులు ఉపవాసాలు ఉండే వారు,
ఏ కష్టం చేయకుండా ఇతరులపై ఆధార పడి
బతికే వాళ్ళు, పంచమహా పాతకం చేసిన వారి కన్నా
పెద్ద పాపాత్ములు..
* పచ్చి పాలు నైవేద్యం పెట్టకూడదు, కాచి చల్లారిన పాలు అభిషేకం కి వాడకూడదు..
* ధ్యానం చేసుకునే ఆసనం అడ్డంగా వేసుకుని కూర్చో కూడదు, నిలువుగా ఉండాలి.
జపమాల చూపుడు వెలుపైన తిప్ప కూడదు మధ్య వేలు తోనే చేయాలి..
* జపానికి వాడే జపమాల మెడలో వేసుకోకూడదు, మెడలో వేసుకున్న మాల జపానికి వాడకూడదు..
* ఒకరు మెడలో వేసుకున్న రుద్రాక్షలు ఇంకొకరు ధరించ కూడదు....
* దేవుడి దగ్గరకు, పెద్దవాళ్ళు దగ్గరకు ,పిల్లలు ఉన్న ఇంటికి ఒట్టి చేతితో వెళ్లకూడదు...
* ఇంట్లో అతిధి ఉన్నప్పుడు వారికి పెట్టకుండా ముందు మీరు తినకూడదు...
* మొదటి సారి ఎవరైనా ఇంటికి భోజనంకి వచ్చినప్పుడు వారుఒక్కసారి వడ్డించిన ఆహారంతో లేవకూడదు రెండవ సారి కాస్త అయినా పెట్టుకోవాలి. అలా ఒక్కసారి లేస్తే ఆతిధ్యం ఇచ్చిన ఫలితం దక్కదు..
* ఇంట్లో పిల్లలు ఇంట్లో వారు తరచూ తిరిగే చోట ఇంటి దైవాన్ని ఫోటో పెట్టాలి, అప్పుడు వస్తూ పోతూ చూసినప్పుడు ఒకసారి ఆ నామం మనసులో తలచుకోవడం అలవాటు అవుతుంది.
* అద్దె ఇల్లు వాస్తు మీ జాతకానికి సరిపడక పోవచ్చు అలాంటి వాస్తు దోషాలు పరిహారం గా ఏడు రంగులు కలిసిన వాల్ మెట్ గోడకు డెకరేషన్ గా పెట్టాలి....
* ఇంట్లో తరచుగా సాంబ్రాణి వేస్తూ ఉండాలి. నెగటివ్ ఎనర్జీ దూరంగా ఉంటుంది.. ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.