పూజా గది - విగ్రహాలు

Telugu Lo Computer
0

 


* పూజ గది విడిగా లేని వారు.. పంచముఖ హనుమంతుడిని పెట్టకూడదు,

హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ గది విడిగా లేని వారు ఉంచకూడదు.

* సూర్యుడి విగ్రహం ఇంట్లో పెట్టకూడదు,

ఆయనే ప్రత్యక్షంగా  కనిపిస్తారు కాబట్టి  నేరుగా నమస్కరించాలి.

* ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో గాని విగ్రహం కానీ ఉంచకూడదు, 

లక్ష్మీ నరసింహ, యోగ నరసింహ, లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టికొని పూజ చేయవచ్చు..

* చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో ఉండకూడదు, 

కృష్ణుడి విగ్రహం అవుతో ఉన్న ఫొటో గాని చిన్న పరిమాణంలో విగ్రహం కానీ ఉండవచ్చు...

*  లక్ష్మీ దేవి విగ్రహం ముందు కానీ ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో(వెండి అయితే మంచిది) బియ్యం, అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి.

*   కాళికా , ప్రత్యంగిరా దేవి ఫోటోలు పెట్టకూడదు.

*   విగ్రహం పరిమితి చాలా చిన్నదిగా ఉంటే  మంచిది , పండో పాలో పెట్టి కూడా హారతి ఇస్తే సరిపోతుంది, విగ్రహాల పరిమితి పెద్దదిగా ఉంటే రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం, ఉండాలి... పూజ లేకుండా ఉండకూడదు...

*  ఇంట్లో నటరాజ స్వామి విగ్రహం పెట్టుకోకూడదు, నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్క ఉండవచ్చు..

*  ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు, ఇంటి యజమానికి తరచూ అనారోగ్యం పాలు అవుతుంటారు, వినాయకుడి ఫొటో, కానీ,దిష్టి యంత్రం గాని, కాళీ పాదం ఫోటో  కానీ పెట్టడం మంచిది..

*   నిత్యం పూజ లో ఉన్న విగ్రహాలు పూజ గది నుండి తీసి వేయాల్సి వస్తే గుడిలో పెట్టండి.. 

*   ఇంటిలో పూజించే వినాయకుడి విగ్రములో 

తొండం ఎడమ వైపు ఉండాలి, విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఉండే విగ్రహంకి 

తొండం కుడి వైపు ఉండాలి..

వ్యాపారం చేసే ప్రాంతంలో నిల్చున్న వినాయకుడు ఉండాలి.

*  ఇంట్లో ఎక్కడా లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉండకూడదు, లక్ష్మీ దేవి పచ్చరంగు చీరతొ అటూఇటూ ఏనుగులు ఉన్న ఫొటో కి గృహస్థులు పూజించడం చాలా మంచిది..

*  పూజ తర్వాత దేవుడి దగ్గర పెట్టిన  నైవేద్యం పూజ ఐయ్యాక వెంటనే తీసేసి ప్రసాదంగా స్వీకరించాలి. 

మీరు చేసిన పూజకు దేవుని అనుగ్రహం ప్రసాదం రూపంలో మీరు స్వీకరించాలి.

*  పూజ గదిలో  ఎంత ఖరీదు అయిన విగ్రహాలు ఉంచినా, పూజ గదిలో గోడకు పసుపు రాసి, వైష్ణవుల అయితే నాంకొమ్ముతో తిరు నామాలు, 

శైవులు అయితే త్రిపురాండ్రులు(అడ్డనామాలు), శక్తేయులు అయితే పసుపు మధ్యలో గౌరీ తిలకం బొట్టులుగా పెట్టాలి, 

వైష్ణవుల అయితే తులసి ఆకుతో గాని తమల పాకును గాని గోడకు రద్దీ నామాలు పెడతారు, 

మీరు ఎంత ఖరీదైన పూజ వస్తువులు ఉంచినా పూజ గది గోడకు ఇలా పెట్టి పూజించడం సాంప్రదాయం , 

ఇది ఇంకా చాలా కుటుంబాలు ఆచరిస్తున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)