చిరాకు....పరాకు....!

Telugu Lo Computer
0

 

ప్రతి ఆదివారంలా లేదీ రోజు అనుకున్నాడు రామారావు.
రామారావు ప్రతి సన్డే ఎనిమిది దాటేక లేచి బయటకు వచ్చి ఓమాటు పేపరు తిలకించి...హాలులో పిల్లలతో కబుర్లు
చెప్తూ కూర్చుంటాడు.
భార్య వసంతలక్ష్మి కాఫీగ్లాసు అందిస్తూ
"స్నానం చేసి కబుర్లు చెప్పుకోవచ్చుగా"
అని అతన్ని పిల్లలను హెచ్చరించి వెళ్తూంటుంది.
రెండో రౌండు కాఫీ తాగడం అవుతుంది కాని...
వీళ్ళ కబుర్లు పూర్తవవు.
పదకొండు గంటలకు టిఫిన్ తినడానికి రడీ అయి వస్తారు.
ఆ తర్వాత కాస్సేపు చూస్తే టివి చూడ్డం...
కాకపోతే పేకాటో, చెస్సో ఆడుతూ కూర్చోవడం...
ఈ ఆదివారం మార్పు చికాకుగానే ఉంది అతనికి.
ముందురోజే చెప్పింది ఆవిడ "తెలిసినవారింట్లో పేరంటం
తను తప్పనిసరిగా వెళ్ళాలని భోజనం టైముకు వస్తానని."
పదయ్యేసరికి టిఫిన్ పెట్టి ఫ్లాస్క్ లో కాఫీ పోసినట్టు చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది.
అబ్బాయి ఫ్రండ్స్ తో మార్నింగ్ షోకి
అమ్మాయి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామంటూ...
వెళ్ళిపోయారు.
అప్పుడప్పుడు పిల్లలు ఇలా వెళ్ళడం మామూలే.
ఎప్పుడూ ఇలా ఒంటరిగా లేడు తను. పెళ్ళాం...పిల్లలు ఒకేసారి ఆదివారం ఉదయం పూట బయటకు వెళ్ళడం
ఇదే మొదటిసారి.
టిఫిన్ తిని...ఫ్లాస్క్ లో కాఫీ కప్పులో పోసుకొని...టివి ముందు కూర్చుని...న్యూస్ చానెల్ ఆన్ చేశాడు.
కాస్సేపటికి బోరనిపించి కట్టేసి...న్యూస్ పేపర్ చదువుదామని... కళ్ళజోడు కోసం చూసాడు.
టీపాయ్ మీదలేదు.
టిఫిన్ తినేటప్పుడు 'అక్కడ గాని వదిలేనా...?!'
అనుకుంటా వెళ్లి చూసాడు లేదు.
మంచంమీద ఉందేమోనని చూసాడు.
లేకపోయేసరికి మరింత చికాకనిపించింది.
ఎక్కడ కనిపించక భార్య కాని పొరపాటున తీసుకువెళ్ళిందేమో...కనుక్కుందామని ఫోన్ చేస్తే
ఆవిడ లిఫ్ట్ చేయకపోవడంతో మరింత విసుగనిపించి...
బయటకు వెళ్దామని తలదవ్వుకోవడానికి డ్రస్సింగ్ టేబుల్ దగ్గరకెళ్ళి అద్దంలో కనిపించిన తనముఖానికున్న కళ్ళజోడును చూసి గతుక్కుమన్నాడు.

లేచి స్నానం చేసాక ఓ నిమిషం పేపరు చూసిన విషయం గుర్తుకొచ్చి తనలోతను...'చిరాకుతో పాటు పరాకుకూడ తోడైందే' అనుకుంటూ నవ్వుకొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)