ప్రొటీమ్ ఛైర్మన్గా బాలసుబ్రహ్మణ్యం

Telugu Lo Computer
0

 

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం ముగియడంతో శాసనమండలి లో సీనియర్ సభ్యులు, పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్ విఠపు బాలసుబ్రహ్మణ్యంని ప్రొటీమ్ ఛైర్మన్ గా నియమిస్తూ గవర్నర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు.
నేటి నుంచి కొత్త ఛైర్మన్ ఎన్నిక అయ్యేవరకు వారు ఈ పదవిలో కొనసాగుతారు.
వారు నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నియోజకవర్గం నుంచి ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మిక ప్రజా సంఘాల మద్దతు తో మూడు సార్లు ఎంఎల్సీ గా గెలుపొందారు.
విద్యా రంగంలో వస్తున్న పరిణామాలు అధ్యయనం చేసి ప్రత్యామ్నాయ విధానాలు సూచించడం తో పాటు పలు రాష్ట్రాలకు సలహాదారుగా పనిచేసిన విద్యావేత్త.

ఉపాధ్యాయ, అధ్యాపకుల ఉద్యమం నుంచి ఉపాధ్యాయ ఎం ఎల్ సి గా ఎన్నికైన విబిఎస్ రాజ్యాంగ బద్ధమైన ఛైర్మన్ పదవికి ఎన్నిక కావడం ఉపాధ్యాయులకు, విద్యాభిమానులకు గర్వకారణం.

Post a Comment

0Comments

Post a Comment (0)