గ్లోబల్‌ మీట్‌కు విజయన్‌, శైలజ

Telugu Lo Computer
0

 

ప్రోగ్రెసివ్‌ ఇంటర్నేషనల్‌ ఫర్‌ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంటర్నేషనలిజం నాలుగు రోజుల శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. 'అందరికీ వ్యాక్సిన్లను అందించడం ద్వారా సాధ్యమైనంత త్వరగా మహమ్మారిని అంతం చేయడం' ఈ సమావేశం ముఖ్యోద్దేశం. కాగా, ఈ నాలుగు రోజలు సమావేశానికి భారత్‌ నుంచి కేరళ సీఎం పినరయి విజయన్‌, రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజలు పాల్గొంటున్నారు.
అలాగే, ఆశా కార్మికుల ప్రతినిధులు, వ్యాక్సిన్‌ తయారీదారు విర్చో లాబోరేటరీస్‌ కార్మికులు ఈ సదస్సులో భాగం అవుతున్నారు. కరోనా మహమ్మారిని అరికట్టే విషయంలో కేరళ రాష్ట్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. విజయన్‌, కేకే శైలజల నేతృత్వంలో కేరళలో మహమ్మారి వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

దేశంలో పాఠశాల విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో కేరళ అగ్ర స్థానంలో నిలవగా గుజరాత్‌ అట్టడుగున ఉంది. బడి మానేసే వారు (డ్రాపౌట్‌ రేటు) గుజరాత్‌లో అత్యధికం కాగా కేరళలో అత్యల్పం. 16-17 సంవత్సరాల వయసులోని ఆడ పిల్లలు గ్రామీణ గుజరాత్‌లో కేవలం 29 శాతం మంది మాత్రమే పాఠశాలకు వెళ్తుండగా కేరళలో 93.6 శాతం మంది వెళ్తున్నారు. ఇదే ఈడు మగ పిల్లల విషయంలో ఈ నిష్పత్తి 45 శాతం, 90.8 శాతంగా ఉంది.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)