బ్లాక్ ఫంగస్కి కారణం అదేనా?

Telugu Lo Computer
0


కోవిడ్ జబ్బులో కొత్త ఉత్పాతం మ్యూకార్ మైకోసిస్.  ప్రపంచంలోని మ్యూకార్ మైకోసిస్  కేసులలో 70 శాతం పైగా భారతదేశంలోనే ఎదురవుతున్నాయని తెలుస్తోంది. మన చుట్టూ వాతావరణంలోనే ఉండే మ్యూకార్ మైకోసిస్ ని అంతా పీలుస్తూనే ఉంటాము. వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ తీవ్రంగా క్షీణించిపోయిన ఈ జబ్బు తలెత్తే అవకాశం ఉంది అని ఇప్పటివరకూ వైద్యశాస్త్రానికి తెలుసు. అయితే అవయవ మార్పిడి (ట్రాన్స్ ప్లాంట్ )షెంట్ లలోనూ, లుకేమియా, హెచ్ఐవి వంటి జబ్బులలోను కూడా చాలా అరుదుగా ఎదురయ్యే ఈ జబ్బు.... కోవిడ్ జబ్బులోనూ, ఆ జబ్బు నుండి కోలుకున్న వారిలోనూ  పెద్ద సంఖ్యలో ఎలా తలెత్తుతున్నది అని చూస్తే ప్రస్తుత కొన్ని సమాధానాలు దొరుకుతున్నాయి. బెంగళూరులో అత్యధిక మ్యూకార్ మైకోసిస్  పేషెంట్లకు వైద్యం చేసిన డాక్టర్ దీపక్ హాల్దిపూర్ చెబుతున్న విషయాలను చూస్తే, ఈ జబ్బు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి యువకులలో కూడా చూశారు. అలాగే కోవిడ్ చికిత్స కోసం  హాస్పిటల్స్ మొహం చూడకుండా, కేవలం ఇంట్లోనే ఉండి వైద్యం చేసుకునే వాళ్ళలో కూడా ఎక్కువగానే గమనించారు.  అదేవిధంగా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ హ్యుమిడిఫైర్స్ మూలంగా వస్తుంది అనుకుంటే... గత ఏడాది  కోవిడ్ జబ్బులో  ఈ మ్యూకార్ మైకోసిస్ లేనే లేదు. మ్యూకార్ మైకోసిస్ జబ్బు బారిన పడ్డవాళ్లలో  మ్యూటేషన్ చెందిన వైరస్, వ్యాక్సిన్ తీసుకోకపోవడం  కారణం కావచ్చును. అన్నిటికీ మించి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో ఆవిరిపట్టడం అనే అలవాటు ఎక్కువగా ఉంది.... అదే పనిగా గంటల తరబడి అధిక వేడిమితో ఆవిరిని పెట్టడం మూలంగా శ్వాస వ్యవస్థలోని మ్యూకోసా రక్షణ పొర దెబ్బతిని మ్యూకార్ మైకోసిస్ అనే అనబడే బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు....  ఆవిరి పట్టడం ప్రమాదకరం అనే విషయాన్ని వివరిస్తూ గతంలో రాసిన ఆర్టికల్ : https://m.facebook.com/story.php?story_fbid=3657307907712722&id=100003006453216

 డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి,

Post a Comment

0Comments

Post a Comment (0)