మండువా లోగలి ఇల్లు!

Telugu Lo Computer
0

   



   పిల్లలుా చూశారా. మీకు నచ్చిందా ఈ ఇల్లు. మండువా లోగలి ఇల్లు. ఎత్తు అరుగులు. లోపల మూడువైపుల మూడు కాపరా లుండొచ్చు. చుట్టూ  ఖాళీ స్ధలము మొక్కలు.మధ్య హాల్లో అంతా కలుసుకోవచ్చు. గతంలో  సమిష్టి కుటుంబాలు వుండేవి. ఇప్పుడు అందరు పట్నాలు పట్టుకు పోయారు గదా. ఇవి పాడుబడుతున్నాయి. 

ఎవరైన ఉచితంగానైనా వుండి దీపం పెట్టెవాళ్ళుంటే చాలనుకుంటున్నారు.

     ఈ ఇళ్ళల్లో ఎండా కాలం చల్లగా, చలికాలం వెచ్చగా వుంటాయి. గాలి వెలుతురు  ధారాళంగా వస్తుంది. చీకటి లేకుండా  పైన అద్దాల అమరిక.

 వర్షపు నీరు మధ్యలో నీరు పడేచిన్న గచ్చుతో గుంతలాంటిది. నీరు బయటకు పోయే కాలువ వుంటుంది.

      పడమర గాలులప్పుడు హాయిగా నేలమాళిగలో వున్నట్లుటుంది. ఇపుడు  అగ్గిపెట్టెల్లాంటి అపార్టమెంటుల్లో కాలూ, చెయ్యి జాపడానికి కూడ భయమే.

కరోనా మహమ్మారి భయంతోనైనా మన పూర్వపు స్ధావరాలకు చేరుకుందామా!

Post a Comment

0Comments

Post a Comment (0)