ఆక్సిజన్ లెవల్స్ చెక్ కు యాప్

Telugu Lo Computer
0


కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ గడగడ లాడిస్తుంది. ఫస్ట్ వేవ్ కన్నా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నవారే ఎక్కువ. అందువలన మన శరీరంలో ఆక్సిజన్  స్థాయిలను తెలిపే పల్స్ ఆక్సిమీటర్లు, స్మార్ట్ వాచ్ లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీనితో వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. మన ఫోన్ లోనే పల్స్, ఆక్సిజన్ స్థాయి, శ్వాసక్రియల రేటు తెలియజేసే ఒక యాప్ ఉంటె బాగుంటుంది కదా! ఆ ఆలోచనల నుండి వచ్చిందే కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్. దీనిని కోల్ కత్తాకు చెందిన   కేర్‌నౌ హెల్త్‌కేర్ (ఇండియా) అనే అంకుర సంస్థ రూపకల్పన చేసింది. 

ఈ యాప్ హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ లెవల్స్ (SpO 2 ) మరియు శ్వాసక్రియ రేటు వంటి విషయాలను పర్యవేక్షించగలదు . కెమెరా మరియు ఫ్లాష్‌లైట్‌ ఉపయోగించి, స్కానింగ్ ద్వారా.. ఆక్సిజన్ రేటు, శ్వాసక్రియ రేటును సులభంగా పరీక్షించవచ్చు.

పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌ వాచ్‌లు పనిచేసే ఫొటోప్లెతీస్మోగ్రఫీ(PPG) ఆధారంగా.. స్మార్ట్‌ఫోన్‌ కెమెరా, ఫ్లాష్‌లైట్‌‌తో ఈ యాప్‌ పని చేస్తుంది. కెమెరా, ఫ్లాష్‌లైట్‌ మీద 40 సెకన్లు వేలిని ఉంచడం ద్వారా SPo2ను లెక్కించవచ్చు. లైట్‌ ఇంటెన్సిటీలో తేడాలను పసిగట్టి PPG గ్రాఫ్‌ను ఈ యాప్‌ సిద్ధం చేస్తుంది. ఈ గ్రాఫ్‌ సాయంతో SPo2 స్థాయి, పల్స్ రేట్‌ తెలుసుకోవ్చని కేర్‌నౌ హెల్త్‌కేర్‌ చెబుతోంది.

ఈ యాప్ ఐఓఎస్  వినియోగదారుల కోసం యాప్ స్టోరీలో ఉంచారు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వెబ్ సైటులో ఏపీకే ను అందుబాటులో వుంచారు. సింగిల్ యూజర్ వినియోగదారుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. పూర్తి వివరాలకు కేర్ నౌ వెబ్ సైట్ ని సందర్శించండి. 

Post a Comment

0Comments

Post a Comment (0)