నిద్రే క‌రోనాకు చెక్?

Telugu Lo Computer
0


స‌రిగ్గా నిద్ర‌పోక‌పోతే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయ‌ట‌. శ‌రీరంలో వైర‌స్ బారిన ప‌డిన క‌ణాల్ని చంపేవి కూడా ఇవే. కాబ‌ట్టి నిద్ర త‌క్కువ‌య్యే కొద్దీ ఒంట్లో వైర‌స్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు.

క‌రోనా సోకినా కూడా ఆందోళ‌న చెంద‌కుండా ధైర్యంగా ఉండండి. వైర‌స్ ద‌రి చేర‌నీయ‌కుండా ఉండేందుకు.. రోజుకి ఎనిమిది గంట‌లు హాయిగా  నిద్ర‌పోండి. అలా ఎంత ఎక్కువ‌గా నిద్ర‌పోతే అంత మంచిద‌ట‌. ఇక‌ ప్ర‌య‌త్నించినా నిద్ర ప‌ట్ట‌డం లేదు అంటారా అయితే ఇలా చేయండి. ఉద‌యాన్నే కాసేపు ఎండ‌లో ఉండండి. రోజంతా చ‌లాకిగా ఉంటారు. రాత్రి పూట నిద్ర బాగా ప‌డుతుంది. రాత్రి నిద్రే మ‌నిషి ఆరోగ్యానికి మంచిది. అలాగే కాఫీ, టీలు కూడా తాగ‌డం త‌గ్గించాలి.  రాత్రి భోజ‌నంలో తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారాన్ని తీసుకోవ‌డం మంచిది. ఇక నిద్ర‌పోయే ముందు పాలు లేదా మ‌జ్జిగ తాగితే బాగా నిద్ర  ప‌డుతుంద‌ని చెబుతున్నారు వైద్యులు.

Post a Comment

0Comments

Post a Comment (0)