యాంటీ బాడీలు ఎన్ని నెలలు ఉంటాయి ?

Telugu Lo Computer
0



ఇతర అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్ తీవ్రత, వయస్సుతో సంబంధం లేకుండానే కరోనా నుండి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు కనీసం 8 నెలలు పాటు కొనసాగుతాయని ఇటలీ శాస్త్రవేత్తలు తెలిపారు. మిలాన్ లోని ఒక ఆసుపత్రిలో చేరిన 162 మంది కరోనా బాధితులపై పరిశోధన చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. 

గత సంవత్సరం కరోనా సోకిన వారి నుండి గత మర్చి, ఏప్రిల్లో ఒకసారి, నవంబర్ చివరిలో ఒకసారి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. వైరస్ ను నిర్వీర్యం చేసే యాంటీ బాడీల ఉనికి నెమ్మదిగా తగ్గుతుంది. వ్యాధి సోకినా 8 నెలల తరువాత కూడా వీరిలో వారి ఉనికి ఉన్నది. ముగ్గురిలో మాత్రమే ఇవి లేవన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)