ఆస్పిరిన్ vs హెపారిన్ మరియు ఎపిక్సిబాన్

Telugu Lo Computer
0

 

*రక్తం గడ్డ కట్టడంలో 3 ప్రముఖ పాత్ర వహిస్తాయి..*
1.ప్లేట్ లెట్సు : రక్తనాళము లలో ఎక్కడైనా రక్త ప్రవాహం మంద గించినా, లోపలి పొర డామేజైనా అక్కడ ఇవి అతుక్కుంటాయి..
2. క్లాటింగ్ ఫాక్టర్సు 13 : ఇవి ప్లేట్లెట్ ల పైన ఒకదానికొకటి అతుక్కొని రియాక్టయి క్లాట్ తయారు చేస్తాయి.
3. ప్లాస్మిన్: క్లాట్ ఎక్కువగా తయారయితే ఇది దానిని కొంచెము బ్రేక్ చేసి అడ్జస్టు చేస్తాయి.. అపుడు బ్రేక్ అయిన ప్రాడక్టులో ఈ D డైమరు లుంటాయి..
అంటే D డైమరు పెరిగితే ఎక్కడో శరీరంలొ క్లాటింగ్ జరుగుతుంది అని అర్ధం.. అంతే కోవిడే అని కాదు...
ప్లేట్ లెట్సు రక్తనాళాల లోపలి పొరకు అతుక్కోకుండా చేసేది ఆస్పిరిన్..క్లోపిడోగ్రిల్.. ఇవి ఎకోస్పిరిన్ 75,150mg అని, క్లోపిటాబ్ A అని దొరికే ఆంటిప్లేట్లెట్సు మందులు,.వీటిని గుండె జబ్బు పేషంట్లకు, స్టెంటు వేసినోళ్కు, బైపాస్ చేసినోళ్ళకు వాడతారు... ఎందుకంటే రక్తనాళాల లోపల పొరలో అధిరోమా అంటే కొవ్వుపొర చీలితే వెంటనే క్లాటింగ్ స్టార్టు అవతాదని...దానిని ఆపొచ్చని..
అసలు ఈ కాంప్లెక్స్ సబ్జెక్టు తెలియాలంటే 3 జబ్బులు తెలియాల..అవి కోవిడ్ లోఇంటర్ లింకు ఉంటాది,..
లెగ్ వీన్ త్రాంబోసిస్, పల్మనరీ త్రాంబోఎంబాలిజమ్, ఊపిరితిత్తులు లో వచ్చే మైక్రోత్రాంబోసిస్ మూడు వేరు..వేరు.. తెలుసుకుందాం
ఎవరైతే ఆసుపత్రి లో చేరతారో బెడ్ పై కదలకుండా ఉంటారో లేక వెంటిలేటర్ పై ఉన్న వారిలో పిక్కలలో గడ్డలు మొదలై పైన సిరలలో గడ్డకట్టడం మొదలవుతుంది... దీనిని *"లెగ్ వీన్ త్రాంబోసిస్"* అంటారు..
ఈ గడ్డ ఊడి రక్తం ప్రవాహంలో కొట్టుకొని పోయి ఊపిరితిత్తులు లోని పల్మనరీ ఆర్టరీలో చేరితే
*"పల్మనరీ త్రాంబో ఎంబాలిజమ్"* అంటారు.. అపుడు ఆయాసం ఎక్కువగా అయి రికవరీ కష్టము అయి పెద్దగడ్డ అయితే ప్రాణాపాయముంటది.. ఇలా రాకుండా మొదటనే D డైమర్ చేసి హెపారిన్, క్లెక్సేన్ సూదులు ఇస్తారు..ఇది గడ్డకట్టకుండా క్లాటింగ్ ఫాక్టరులను అడ్డుకుంటాది... చెప్పేదేమంటే ఆసుపత్రి లో చేరి సీరియస్గా బెడ్లో పడి వెంటిలేటరుపెట్టి కదలలేనపుడు వైద్యులు అందరికీ ఇస్తారు.. మీరు హైరానా పడవలసింది లేదు.
**********************************************
కోవిడ్ సైటోకైన్ స్టార్ము వచ్చి సీరియస్ కండీషన్ లలో ఊపిరితిత్తులు లో రక్తనాళము లలో చిన్న క్లాట్సు వచ్చి మైక్రో త్రాంబోసిస్ జరుగుతుంది. ఇది ఆసుపత్రి లో చేరిన వారిలో డాక్టరు లు D డైమరు చేసి రాకుండా హెపారిన్ ఇస్తారు... అంతే.. అందరికీ అవసరం లేదు.
******************************************
ఎవరికైతే హెపారిన్ ఇస్తారో వారు 3 నెలలు అపిక్సిబాన్ టాబ్లెట్సు ఇస్తారు ఇవి సూదులు కాకుండా నోటితో ఇచ్చే మాత్రలు..ఆంటీ కొయాగులెంట్సే... ఈ మాత్రలు వాడాలి,,వీటిని ఓరల్ కోయాగులెంట్సు అంటారు,,బ్లడ్ ధిన్నర్ అంటారు..కాని సమస్య ఏటంటే అల్సరున్న వాళ్ళు, బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల..ప్రాణాపాయము జరగచ్చు,.స్వంత వైద్యం డేంజరు.. వీరు ముఖ్యంగా చిన్న చిన్న దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. నెల రోజుల కొకసారి PT/INR టెస్టు చేసుకోవాలి.
కొందరికి ఆస్పిరిన్75 కూడా రాస్తారు..కాని ఇది ఆంటి ప్లేట్ లెట్.. ఇది ఎవరికంటే వెరికోస్ వీన్సు ఉండి బ్లడ్ స్టాగ్నేషన్ వాళ్ళకు పనికొస్తాది.. కోవిడ్ వచ్చే అందరికీ అవసరం లేదు..కావున చాలామంది స్వీయగృహవైద్యం వాళ్ళకు ఈ పరీక్షలు ఆస్పిరిన్ అవసరం లేదు.,అందుకే 300 KIT లో చేర్చలేదు...బాగా నీరుతాగి అపుడపుడు గంటకొక సారి లేచి అలా అలా తిరుగుతూ ఉండాలి.,పిక్కలు పట్టకుండా చూసుకోవాలి .. అంతే .. ఏ డైమర్ లు అవసరం లేదు...ఆస్పిరిన్ అవసరం లేదు.. బ్లీడింగు అయితే కష్ఠం ..ఎవరికి అల్సరుందో ఎవరికి లేదో జనరల్ గా చెప్పడం కష్టం ... చాలామందికి కడుపు మంట వస్తాది,,మరలా అదో తలనొప్పి.,. ఎంటిరిక్ కోటెడు ఆస్పిరిన్ అని ఉన్నా చాలామంది టాలరేటు చేయలేరు..
స్వీయగృహవైద్యం వారికి ఈ మందులేవి అవసరం లేదు..రిలాక్స్ ,,
ఆసుపత్రి లో చేరినవారికి ఎలాగూ ఇస్తారు,,అది వైద్యుల తలనొప్పి..రిలాక్స్ ..,
రెండవ వారంలో D DIMERS పెరిగితే వైద్యులు చెబితే ఆస్పిరిన్, అపిక్సిబాన్ వారి పర్యవేక్షణలో వేసుకోండి.,80% కు అవసరం లేదు,,,లేకుంటే రిలాక్స్ ..
300 KIT వేసుకోండి చాలు.. ఎక్కువగా సైన్సు తెలుసు కొని స్వంతంగా వేసుకోకండి.. బ్లీడింగు అయితే చాలా కష్ఠం..వయసయినవారికి బ్రెయిన్ లో బ్లీడింగు అయితే పక్షవాతమొస్తాది,,ప్రాణాపాయముంటాది.. జాగ్రత్తగా ఉండాలి....
భయపడకండి..తెలుసుకోగలిగినది తెలుసుకోండి..
మాస్కు, శానిటైజర్, దూరం దూరం, వాక్సిన్, 300 KIT, 104, ఆక్సిజన్,స్టీరాయిడ్సు, అంతే,. మన మంత్రాలు

Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

Post a Comment

0Comments

Post a Comment (0)