కరోనా బాధితులను గుర్తిస్తున్న శునకాలు

Telugu Lo Computer
0

 

శిక్షణ పొందిన జాగిలాలు కరోనా బాధితులను క్షణాల్లోనే కొవిడ్‌ బాధితులను గుర్తిస్తున్నాయి. పైగా 92% నుంచి 94% వరకు కచ్చితత్వంతో గుర్తిస్తుండటం విశేషం. దీంతో ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఈ విధానంపై దృష్టిసారించాయి. 

 తాజాగా థాయ్ లాండ్ ప్రభుత్వం కూడా శునకాల శిక్షణ ఇచ్చి రంగంలో దించారు. ఈనెల 10 నుండి ఇప్పటి వరకు వేయి మందిని రోగులను గుర్తించాయియునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రభుత్వం కరోనా రోగులను గుర్తించేందుకు విమానాశ్రయాల్లో 'కే9ఫోర్స్‌' పేరుతో శునకాలను మోహరించింది. ప్రయాణికుల నుంచి సేకరించిన చెమట వాసన చూసి.. కరోనా ఉన్నదో లేదో గుర్తిస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే వైద్యసిబ్బంది వారినుంచి చెమట శాంపిళ్లను తీసుకుంటారు. వాటిని ఓ గదిలో ఏర్పాటుచేసిన ప్రత్యేక చాంబర్లలో వేసిన తర్వాత కే9 శునకాలు వచ్చి వాసన చూస్తాయి. కరోనా ఉన్న శాంపిల్‌ను గుర్తించగానే అక్కడే కూర్చుండిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

 బ్రిటన్‌, జర్మనీ, చిలీ దేశాలు సైతం శునకాలకు శిక్షణ ఇస్తున్నాయి. జర్మనీ ప్రభుత్వం సైన్యానికి చెందిన ఎనిమిది కుక్కలకు లాలాజలంలో కరోనాను గుర్తించేలా శిక్షణ ఇచ్చింది. వెయ్యి శాంపిళ్లను పరీక్షించగా 94% కచ్చితత్వంతో ఫలితాలు వచ్చాయని అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)