ఇక ఆపేయమ్మా !

Telugu Lo Computer
0

 

ఉగాండా దేశానికి చెందిన మరియం నబాతంజి అనే ఆమెకు13 ఏళ్లకే వివాహమైంది. అదే సంవత్సరం కవల పిల్లలకు జన్మనిచ్చింది.  కవల పిల్లలు పుట్టినప్పుడు డాక్టర్ల వద్దకెళ్లి తనకు గర్భనిరోధక ఆపరేషన్ చేయమని అడిగింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. అలా మొదలైంది ఆమె పిల్లల్ని కనే ప్రక్రియ 40 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా 44 మంది పిల్లలు పుట్టారు. తొలి కాన్పులోనే కవల పిల్లలకు జన్మనిచ్చిన మరియం ఆ తరువాత ఆరు కాన్పుల్లో కవలలను, నాలుగు కాన్పుల్లో ముగ్గురేసి చొప్పున మొత్తం 44మంది పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఆరుగురు పిల్లలు పుట్టగానే చనిపోయారు. ప్రస్తుతం మరియంకు 38 మంది పిల్లలు ఉన్నారు. 

ఆమెను పరీక్షించిన డాక్టర్లు అండాశయాలు చాలా పెద్దగా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఆమెకు మరింతమంది కవలలు పుడతారని చెప్పారు. దానికి కారణం ఆమెకు ఒకేసారి అనేక అండాలు విడుదల కావటంతో కవలపిల్లలు పుడతారని తెలిపారు. డాక్టర్లు చెప్పినట్లుగానే మరియంకు పలు కాన్పుల్లో ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు పుట్టారు. అలా ఇంతమంది పిల్లల్ని సాకటం ఆమెకు కష్టంగా ఉన్నా చాలా ప్రేమగా చూసుకుంటూ, పిల్లలను స్కూలుకు కూడా పంపుతుంది. ఇంతమందిని  నేను పోషించలేనంటూ ఆమె భర్త వదిలేశాడు. దీంతో అంతమంది పిల్లలు పెంచి పోషించటం మరియమ్మమీద పడింది. 

 ఇకపై పిల్లల్నికనను అనే షరతు మీద ఆమెకు ప్రభుత్వం సహాయం చేయటానికి ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)