పెయిన్ కిల్లర్స్ కు అద్భుతమైన వైద్యం వావిలాకు !

Telugu Lo Computer
0


వావిలాకు ఒంటి నొప్పులను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. పల్లెటూర్లలో విరివిగా లభించే వావిలాకు ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒంటి నొప్పులు ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఆకులు వేసి మరిగించి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఒక కప్పు వావిలి ఆకులు తీసుకుని మెత్తని పేస్ట్ గా చేసి రసాన్ని తీయాలి. ఒక కప్పు ఆవ నూనె, ఒక కప్పు వావిలాకు రసం వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనె కొంచెం గోరువెచ్చగా చేసి శరీరం మొత్తానికి పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే .ఒంటి నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు వావిలి ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి నుదురు పై రాసి పదినిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే తలనొప్పి మాయం అవుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)