హైదరాబాద్‌ ఓవైఓ హోటల్ లో అగ్ని ప్రమాదం : అడ్డంగా బుక్ అయిన ప్రేమ జంట !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని చైతన్యపురి మోహన్ నగర్ లోని ఓయో హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎల్బీ నగర్ ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ గురైయ్యారు. దీంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ప్రేమికులు మాత్రం అడ్డంగా దొరికిపోయారు. అగ్ని ప్రమాదం జరుగగానే…ఎవరి కంట పడొద్దని హోటల్‌ బయట వైపు ఉన్న ఓ సిమెంట్‌ భాగంపైన నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)