పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఈసీ ఆదేశం !

Telugu Lo Computer
0


కేంద్ర ఎన్నికల సంఘం పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించింది. గత పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా పిర్యాదులు వచ్చాయని గుర్తు చేసిన ఎన్నికల సంఘం, గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా అమలు చేయాలని సూచించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని.. కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. గతంలో మాదిరి గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెన్షన్లు పొందేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు పేర్కొంది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఈసీ స్పష్టం చేసింది. పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని పేర్కొంది. పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వడానికి.. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టంగా ఆదేశించింది. ఈ ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవడమంటే ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలోనే సకాలంలో డబ్బు రెడీగా ఉంచుకోవడంతో పాటు, లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే.. వారంతా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉందని సూచించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)