ఎంపీ రవికిషన్ నా భర్తే !

Telugu Lo Computer
0


టుడు, భాజాపా ఎంపీ రవికిషన్ చిక్కుల్లో పడ్డాడు. తను ఆయన భార్యనే అంటూ ఓ మహిళ మీడియా ముందుకొచ్చింది. తన కూతుర్ని ఆయన స్వీకరించాలని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ విషయం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇప్పటికీ ప్రీతి కిషన్ అనే మహిళని పెళ్లి చేసుకున్న రవికిషన్ కి రివా కిషన్ అనే కూతురు ఉంది. భోజ్ పురి, హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న రవికిషన్, అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించాడు. 2019లో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పుర్ నుంచి ఎంపీగా గెలిచాడు. మరోసారి పోటీ చేయబోతున్నాడు. అపర్ణా ఠాకుర్ అనే మహిళ.. తన ఆయన భార్యనే అంటూ మీడియా ముందుకొచ్చింది. 1996లోనే తమకు పెళ్లి జరిగిందని, పాప కూడా పుట్టిందని ఆమెని తీసుకొచ్చింది. పాత ఫొటోల్ని కూడా మీడియాకు రిలీజ్ చేసింది. తమతో రవికిషన్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారని, కానీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోవడం లేదని ఈమె ఆరోపణలు చేసింది.  'రవికిషన్ నా తండ్రి అని.. నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాతే తెలిసింది. అంతకు ముందు ఆయన్ని అంకుల్ అని పిలిచేదాన్ని. నా ప్రతి పుట్టినరోజుకి మా ఇంటికి వచ్చేవారు. ఆయన కుటుంబాన్ని కూడా నేను ఓసారి కలిశాను. తండ్రిగా చూస్తే మాత్రం ఎప్పుడు నా దగ్గర లేరు. నన్ను కూతురిగా స్వీకరించాలని ఆయన్ని కోరుతున్నా. అందుకే కోర్టులో కేసు వేద్దామని అనుకుంటున్నాం' అని అపర్ణ ఠాకుర్ కూతురు చెప్పుకొచ్చింది. అయితే ఈ మొత్తం విషయమై రవికిషన్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)