నూతన వధూవరులకు అమ్మవారి ఉచితంగా వీఐపీ దర్శనం !

Telugu Lo Computer
0


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మ వారి దర్శనం సౌభాగ్యమస్తు పథకం కింద కొత్తగా పెళ్లైనవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు దుర్గామల్లేశ్వరిస్వామి వార్ల దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు.  మే నెల ప్రారంభం నుంచి నూతన వధూవరులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేస్తారు.  అయితే సౌభాగ్యమస్తు పథకం కింద కొత్తగా పెళ్లైనవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని పొందేందుకు కొత్తగా పెళ్లైన దంపతులు మాత్రమే అర్హులు. వివాహ దుస్తుల్లోనే ఆలయాన్ని సందర్శించాలి. కొత్త జంటతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)