'సంకల్ప్ పత్ర' పేరుతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన మోడీ !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 'సంకల్ప్ పత్ర' పేరుతో ఢిల్లీలోని జాతీయ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ  మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మోడీ గ్యారంటీ, 2047 నాటికి వికసిత్ భారత్ థీమ్‌తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా దీన్ని రూపొందించారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ తన రిజల్యూషన్ మేనిఫెస్టోను ఆదివారం (ఏప్రిల్ 14) విడుదల చేసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం 2024 జనవరి 25న మోడీ ప్రజల నుంచి సూచనలు కోరారు. ఆ తర్వాత పార్టీకి 15 లక్షలకు పైగా సూచనలు వచ్చాయి. నమో యాప్ ద్వారా 4 లక్షల మంది, వీడియో ద్వారా 11 లక్షల మంది తమ సలహాలను అందించారు. మార్చి 30న మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను అధ్యక్షుడిగా చేసి, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా 27 మంది సభ్యులను చేర్చారు. ఈరోజు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి అని, ఆయనకు నివాళులు అర్పిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడారని మనందరికీ తెలుసు. ఆయన బాటలోనే బీజేపీ సామాజిక న్యాయం కోసం ఎప్పుడూ పోరాడుతోందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)