జూన్​ 29 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం !

Telugu Lo Computer
0


జూన్ 29 అమర్​నాథ్​ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను ప్రారంభించారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్మూకాశ్మీర్ ​ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే అమర్​ నాథ్​ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్​ ప్రభుత్వం తాజాగా అమర్‌నాథ్ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. దక్షిణ కాశ్మీర్​లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్​నాథ్​ ఆలయం ఉంటుంది. అనంతనాగ్​ జిల్లా పహల్గామ్​, గండర్​బాల్​ జిల్లా బల్టాల్​ మార్గాల్లో అమర్​నాథ్​ యాత్ర కొనసాగుతుంది. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. www.jksasb.nic.in. వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. అయితే 13 నుంచి 70ఏళ్ల మధ్యలో ఉన్న వారే ఈ యాత్ర చేయాలి. అయితే 6నెలల గర్భంతో ఉన్న మహిళలు కూడా యాత్రకు వెళ్లలేరు. పలు భద్రతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్‌నాథ్‌ యాత్ర టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది 2024 అమర్‌నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళుతుంటారు. అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాత్ర కు సంభందించిన పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ ఏడాది దాదాపు 45 రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశమివ్వనున్నారు. యాత్ర కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15న ప్రారంభమవుతుందని తెలిపారు.ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్‌ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)